ఏపీలో రేషన్ షాపుల్లో ఇకనుంచి సన్నబియ్యం

ఏపీలో రేషన్ షాపుల్లో ఇకనుంచి సన్నబియ్యం

ఏపీ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ఈ రోజు సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం భేటిలో రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీపై తీసుకోవాల్సిన చర్చ జరిగింది. రేషన్ షాపుల ద్వారా కల్తీలేని సన్నబియ్యాన్ని సరఫరా చేస్తామని, రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తెస్తామని చర్చలో పాల్గొన్న నాని అన్నారు.

రేషన్ ద్వారా ఈ బియ్యం సరఫరా చేసేందుకు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని ఆయన అన్నారు. బియ్యం సేకరణకు అవలంభించాల్సిన విధానాలపై సమావేశంలో చర్చించినట్లు, సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వంపై వెయ్యి కోట్లు భారం పడుతుందని అంచనా వేసినట్లు మంత్రి నాని వివరించారు.