తెలంగాణలో ఓటేసే ఏపీ ఉద్యోగులకు సెలవు .. ఉత్తర్వులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్​ సీఈవో

తెలంగాణలో ఓటేసే ఏపీ ఉద్యోగులకు సెలవు .. ఉత్తర్వులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్​ సీఈవో

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణలో గురువారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఏపీలో ఉద్యోగం చేస్తూ తెలంగాణలో ఓటు హక్కు ఉన్న వారికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. సెక్రటేరియెట్ ఉద్యోగుల సంఘం వినతి మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ ​కుమార్ మీనా సెలవు ఇచ్చారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు ఆధారాలు చూపించి సెలవు పొందవచ్చని సూచించింది. తెలంగాణ, ఏపీ సరిహద్దులో అనేక మంది ఉద్యోగులు ఇరు జిల్లాలో పనిచేస్తున్నందున ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేటీఆర్ ​ఈసీ ఆదేశాలను బేఖాతర్

ఏపీలో ఉన్న తెలంగాణ ఓటర్లు ఓటు వేసే లాగా చర్యలు తీసుకోవాలని బుధవారం సీఈఓ వికాస్ రాజ్​ను కాంగ్రెస్ లీడర్లు మల్లురవి, నిరంజన్​ కోరారు. అలాగే, బీఆర్ఎస్​ అధికారిక మీడియాలో కోడ్ ఉల్లంఘిస్తూ.. ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మద్యం, డబ్బు పంపిణీని కంట్రోల్ చేయాలన్నారు. సైలెంట్ పీరియడ్​లో ఈసీ ఆదేశాలను బేఖాతర్ ​చేస్తూ దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ పిలుపు నిచ్చారన్నారు.