
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.శనివారం(జూలై19న ) రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, శాసన సభా స్పీకర్ హాజరయ్యారు.
నియామకం: సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను త్రిపుర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యే ముందు ఆయన త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.జస్టిస్ అపరేష్ కుమార్ ఇంతకు ముందు ఝార్ఖండ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. 2022లో ఝార్ఖండ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. న్యాయవాద కుటుంబం నుంచి వచ్చారు జస్టిస్ సింగ్. ఆయన తల్లి వైపు తాతగారు దివంగత బి.పి. సిన్హా భారతదేశ ఆరవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
ALSO READ : శ్రీశైలంలో ఈ రెండు ఊర్ల పేర్లు మారాయి.. గమనించగలరు..!
జస్టిస్ అపరేష్ కుమార్ ఢిల్లీ యూనివర్సిటీ నుండి బి.ఏ.(ఆనర్స్) ,ఎల్‌ఎల్‌బి డిగ్రీలను పొందారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారుు. పట్నా హైకోర్టులో 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు. 2001లో ఝార్ఖండ్ హైకోర్టు ఏర్పడిన తర్వాత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు.