
ఇండియన్ స్టార్ యాక్టర్ షారూఖ్ ఖాన్ గాయపడ్డాడు.. షూటింగ్ లో అయిన గాయానికి.. అమెరికా వెళ్లి మరీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.. ఈ విషయం జరిగి కొన్ని రోజులు అయినా.. 2025, జూలై 19వ తేదీ మాత్రమే బయటకు వచ్చింది. దీంతో షారూఖ్ ఖాన్ కు ఏమైందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కొత్త సినిమా కింగ్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటూ ఉన్నారు షారూఖ్. కింగ్ సినిమా షూటింగ్.. ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో భారీ సెట్ లో షూటింగ్ జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో షారూఖ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే.. షూటింగ్ స్పాట్ నుంచి.. స్టూడియో నుంచి నేరుగా ముంబైలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాడు షారూఖ్. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం సిఫార్సు చేశారు డాక్టర్లు.
షూటింగ్ లో గాయపడిన తర్వాత.. డాక్టర్ల సూచనలతో.. షారూఖ్ ఖాన్ అమెరికాలో వెళ్లినట్లు బాలీవుడ్ సమాచారం. కొన్ని రోజుల క్రితమే షారూఖ్ అమెరికాలో వెళ్లాడని.. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని.. కనీసం నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్లు బాలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం.
ALSO READ : Sangeeta Bijlani: సంగీత బిజ్లానీ ఫామ్‌హౌస్‌లో దొంగతనం.. లక్షల విలువైన వస్తువులు మాయం!
గాయం తీవ్రత ఏంటీ.. శరీరంలోని ఏ భాగాల్లో గాయం అయ్యింది అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం అమెరికాలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని.. ఆగస్ట్ నెల మొత్తం అమెరికాలోనే ఉంటారనే వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో కింగ్ సినిమా షూటింగ్ లో తిరిగి పాల్గొంటారని.. అనుకున్న షెడ్యూల్ ప్రకారం మూవీని 2026లో రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.
కింగ్ మూవీ షూటింగ్ కోసం జూలై, ఆగస్ట్ నెల్లో హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీ, ముంబైలోని గోల్డెన్ రటొబాకో, వైఆర్ఎఫ్ స్టూడియోలను బుక్ చేశారు నిర్మాతలు. ఊహించని విధంగా.. అనుకోకుండా షారూఖ్ ఖాన్ గాయపడటంతో.. జూలై, ఆగస్ట్ నెలల్లో బుక్ చేసుకున్న స్టూడియో షెడ్యూల్ ను క్యాన్సిల్ చేశారు నిర్మాతలు.