DNA Movie : థియేటర్‌లో వచ్చిన మరుసటి రోజే OTTలోకి 'మై బేబీ'.. తెలుగు నిర్మాతలకు భారీ షాక్!

DNA Movie :  థియేటర్‌లో వచ్చిన మరుసటి రోజే OTTలోకి 'మై బేబీ'..  తెలుగు నిర్మాతలకు భారీ షాక్!

సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత  కొన్ని వారాలు లేదా నెలల తర్వాతే OTTలో స్ట్రీమింగ్ కు వస్తుంది. ఇప్పుడు తమిళనాట హిట్ కొట్టిన సినిమా.. టాలీవుడ్ లోకి వచ్చేసరికి వింత పరిస్థితి ఎదురైంది.  ఈ అనూహ్య పరిణామం తెలుగు నిర్మాతలను ఒక్క సారిగా షాక్ గురైయ్యారు. పెట్టిన బడ్జెట్ తిరిగి రాక లబోదిబో అంటున్నారు.  ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో గగ్గోలు పెడుతున్నారు. ఇంతకి అది ఏ సినిమా అనుకుంటున్నారా..  ?

OTTలో విడుదల వెనుక అసలు కారణం..
అధర్వ మురళి ( Atharvaa Murali ), నిమిషా సజయన్ ( Nimisha Sajayan )జంటగా నటించిన, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించినచిత్రం 'డీఎన్‌ఏ' ( DNA ) .   ఇది తమిళంలో జూన్ 20న విడుదలై ఘనం విజయం సాధించింది.  తెలుగులో 'మై బేబీ' ( My Baby Movie )పేరుతో జూలై 18న థియేటర్లలో విడుదలైంది. అయితే మరుసటి రోజే ( జూలై 19, 2025) జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావడంతో అందరిని షాక్ గురిచేసింది.  తొలుత  తెలుగులో ఈ మూవీని జూలై 11న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే సెన్సార్ ఆలస్యం కావడంతో విడుదల తేదీని జూలై 18కి వాయిదా వేశారు. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది.  

'డీఎన్ఏ' మూవీ నిర్మాతలు జియోహాట్ స్టార్ తో చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం జూలైన 18న OTTలోకి రావాల్సి ఉంది. అయితే తెలుగులో థియేట్రికల్ విడుదల వాయిదా పడటంతో జియో హాట్ స్టార్ కేవలం ఒక్క రోజు మాత్రమే ఓటీటీ విడుదల వాయిదా వేసింది.  ఒప్పందం మేరకు జూలై 19  నుంచే తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభించింది. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు సహితం ఓటీటీలో చూస్తేన్నారు. దీంతో తెలుగులో థ్రియేట్రికల్ రైట్స్ కొన్న నిర్మాతలు భారీగా నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ..
ఈ చిత్రం 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. కథ విషయానికి వస్తే, ప్రేమలో విఫలమై తాగుబోతుగా మారిన ఆనంద్ (అధర్వ మురళి) జీవితం, బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న దివ్య (నిమిషా సజయన్)ను పెళ్లి చేసుకున్న తర్వాత మలుపు తిరుగుతుంది. వారి సంతోషకరమైన జీవితంలో ఊహించని సంఘటన దివ్య ప్రసవం సమయంలో జరుగుతుంది. ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత, దివ్య తన బిడ్డను మార్చారని ఆరోపిస్తుంది. మొదట్లో ఆమె మాటలను ఎవరూ నమ్మకపోయినా, ఆమె ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమైనా, ఆనంద్ ఒక్కడే తన భార్యకు మద్దతుగా నిలుస్తాడు.

ఆనంద్ భార్యకు అండగా నిలవడంతోనే అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయి. దివ్య చెప్పినట్లు నిజంగానే ఆసుపత్రిలో పుట్టిన బిడ్డను మార్చారా? గతంలో ఇలాంటి సంఘటనలు మరెవరికైనా జరిగాయా? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? చివరకు ఆనంద్ తన నిజమైన బిడ్డను కనుగొన్నాడా? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమాలో ఉత్కంఠభరితమైన కథనంతో సాగుతూ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. ఇది ఒక పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనడంలో సందేహం లేదు.

తెలుగు నిర్మాతలకు షాక్
ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఈ అనూహ్యమైన, త్వరితగతిన జరిగిన ఓటీటీ విడుదల తెలుగు నిర్మాతలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. థియేటర్లలో సినిమా ఆడిన మరుసటి రోజే ఓటీటీలో అందుబాటులోకి రావడంతో వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామం నేపథ్యంలో భవిష్యత్తులో తెలుగు చిత్రాల థియేటర్ - ఓటీటీ విడుదల మధ్య సమన్వయంపై అవసరం అని వారు స్పష్టం చేస్తున్నారు. లేకపోతే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.