
ఉండవల్లిలోని ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం.. ఈ నెల 24 వ తేదీన ఆ వేదికలోనే కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. అయితే ఇప్పటికే ఆ ఆఫీస్ లో ఉన్న టీడీపీ తాలూకు సామాగ్రిని తీసుకువెళ్లాలని సీఆర్డీఏ అధికారులు ఆ పార్టీ నేతలను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రజావేదికలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నమూనా ను కూడా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పెట్టారు. క్రమంలో ఇది సరైన చర్య కాదని.. ప్రజావేదిక తమకు కేటాయించాలంటూ.. ఇంతకు ముందే లేఖ రాశామన్నారు టీడీపీ నేతలు. ఆ లేఖకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఇలా టీడీపీ ఆఫీస్ నమూనాను పక్కన పడేయటం దారుణమని వారు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.