తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాల  వాళ్లు జాగ్రత్త

రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు విస్తా రంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వా తావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా సముద్ర మట్టం నుంచి 3. 1 నుంచి 5.8 కి.మీల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతున్నట్లు చెప్పింది. దీని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉంటుందని పేర్కొన్న ఐఎండీ.. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ , నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, భూపా లపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు చెప్పిన ఐఎండీ.. యెల్లో అలర్ట్ జారీ చేసింది. 

మిగతా అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. అదే విధంగా గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఇక హైదరాబాద్లో ఇవాళ తేలికపా టి జల్లులకు అవకాశం ఉందని, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

 రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. అదే విధంగా కా మారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫా బాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరి సిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.