మద్యం షాపులను తగ్గిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు

మద్యం షాపులను తగ్గిస్తూ  ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది . అందులో భాగంగానే రాష్ట్రంలో మ‌రో 13శాతం మ‌ద్యం దుకాణాలు తొలగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది . దీంతో మొత్తంగా 33శాతం వైన్‌ షాపులు తొలగించ‌డంతో మద్యం దుకాణాల సంఖ్య 2934కు తగ్గనుంది. గతంలోనే 40శాతం బార్లు, 20శాతం షాపులను తొలగించిన ప్రభుత్వం తాజాగా మరో 13శాతం వైన్స్‌ షాపులను రద్దు చేసింది. ఈనెలఖరు వరకు దుకాణాలు తీసివేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 4380 లిక్కర్ షాపులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేవి. వాటిని గ‌తంలోనే 3500కు తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ వల్ల ఇప్పుడు వాటిని 2934కు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ap govt order to reduce liquor shops by 13% in state