ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికలు వాయిదావేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

హైకోర్టు వెల్లడించిన తాజా తీర్పుతో గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ స్పష్టం చేశారు. త్వరలోనే సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. గతంలో అనుకున్నట్లుగానే ఫిబ్రవరి 5,9,13,17 తేదీల్లో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

For More News..

ఆల్ టైం రికార్డుకి సెన్సెక్స్.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

అమ్ముడుపోని టిక్కెట్‌కు రూ. 12 కోట్ల లాటరీ

వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిషబ్ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌