జస్టిస్ కనగరాజు నియామకాన్ని రద్దు చేసిన ఏపీ హైకోర్టు

V6 Velugu Posted on Sep 16, 2021

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ వి.కనకరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఇవాళ సస్పెండ్‌ చేసింది. జస్టిస్ కనకరాజ్ నియామకాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది పారా కిశోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును గురువారం హైకోర్టు విచారించింది.  పిటిషనర్ న్యాయవాది పారా కిషోర్ తరపున మరో న్యాయవాది ఇంద్రనీల్ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ జస్టిస్ కనగరాజ్ నియామకం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. కాబట్టి జస్టిస్ కనగరాజు నియామకం చెల్లదని అభ్యంతరం తెలిపారు. వాదనల అనంతరం హైకోర్టు జస్టిస్ కనగరాజు నియామకాన్ని సస్పెండ్ చేశారు. 
 

Tagged VIjayawada, Amaravati, AP High Court, ap today, , bejawada, high court of ap, justice kanagaraju, ap police complaint authority chairman, ap highcourt quashes

Latest Videos

Subscribe Now

More News