ఏపీ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే టాప్

ఏపీ ఇంటర్  ఫలితాల్లో అమ్మాయిలే టాప్

విజయవాడ: ఏపీ ఇంటర్ రిజల్స్ రిలీజ్ అయ్యాయి. ఇంటర్వ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం గ్రేడింగ్ లో రిజల్స్ వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ రిజల్స్ లో అమ్మాయిలే టాప్ లో నిలిచారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 60 శాతం, సెకండియర్ లో 72 శాతం పాస్ అయ్యారు. ప్రభుత్వ కాలేజీల్లో 67 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. మే 14న అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఉదయలక్ష్మి.