వచ్చేది బీజేపీ సర్కారే : ఏపీ జితేందర్ రెడ్డి

వచ్చేది బీజేపీ సర్కారే : ఏపీ జితేందర్ రెడ్డి

వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం వనపర్తిలో జరిగిన అసెంబ్లీ, బూత్  కమిటీ శక్తి కేంద్ర ఇన్​చార్జుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మోదీ తొమ్మిదేండ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని, జీ20 దేశాల సమావేశంతో పాటు మేకిన్  ఇండియా, మహిళా బిల్లు, చంద్రయాన్–3 వంటి అంశాలు దేశ ప్రతిష్టను పెంచాయన్నారు.

పీఆర్ఎల్ఐని రాజకీయ ప్రయోజనాల కోసమే ఓపెన్​ చేశారని విమర్శించారు. రూ.32 వేల కోట్ల అంచనాతో పనులు మొదలు పెట్టి రూ.60 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. వేల కోట్లు కమీషన్ల రూపంలో సీఎం కేసీఆర్ దండుకున్నాడని ఆరోపించారు. గతంలో భూమి లేని బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు వందల ఎకరాల భూములు కొనుగోలు చేసి ఫాం హౌస్ లు నిర్మించుకున్నారన్నారు.

రాష్ట్రంలో బీజేపీ 55కి పైగా సీట్లు వస్తాయని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్  శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఇన్​చార్జి బోసుపల్లి ప్రతాప్, సబిరెడ్డి వెంకటరెడ్డి, బి.కృష్ణ, అశ్వథ్థామరెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, మున్నూరు రవీందర్, జింకల కృష్ణయ్య  పాల్గొన్నారు.