పరిస్థితిని బట్టి ఎగ్జామ్స్‌పై నిర్ణయం తీసుకుంటాం

పరిస్థితిని బట్టి ఎగ్జామ్స్‌పై నిర్ణయం తీసుకుంటాం

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏపీలో పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందని ఆయన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు విద్యాశాఖ శ్రద్ద తీసుకుంటుందని ఆయన అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికే 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు గతంలోనే షెడ్యూల్ ఇచ్చి ప్రణాళిక రూపొందించి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.  అయితే రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితిని బట్టి దానికనుగుణంగా పరీక్షల విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది రానివ్వమని ఆయన హామీ ఇచ్చారు.