
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందని ఏపీ ఫైనా న్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అన్నారు. ఎప్పటికైనా సీఎం అవుతానని రేవంత్ తనతో గతంలో చాలా సార్లు చెప్పారన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ ఎంతో కష్టపడి పై కొచ్చారని, తెలంగాణ ప్రజలు రేవంత్‌ను ప్రత్యామ్నాయంగా చూశారన్నారు. తెలంగాణలో రాజకీయ సైలెన్స్ సాధ్యం కాదని పేర్కొన్నారు.