ప్రధాని మోడీతో రోజా సెల్ఫీ

ప్రధాని మోడీతో రోజా సెల్ఫీ

పశ్చిమగోదావరి జిల్లా: భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్లొన్న ప్రధాని మోడీ.. అక్కడ ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.  ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు. అజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్‌ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు. వేడుకలు ముగిసిన తర్వాత మంత్రి రోజా ప్రధాని మోడీతో సెల్ఫీ దిగారు. మోడీ స్టేజ్ నుండి దిగేసమయంలో ప్రధానిని ఒక్క సెల్ఫీ ప్లీజ్ సార్ అని రోజా అడగగానే మోడీ నవ్వుతూ ఒకే అన్నారు. వెంటనే రోజా ప్రధాని మోడీతో..పక్కనే ఉన్న జగన్ తో రోజా సెల్ఫీ దిగడంతో ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ప్రధాని మోడీ ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అక్కడ  నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నారు.