ఏపీలో సినిమా థియేటర్ల యజమానులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు జగన్ సర్కార్ అనుమతించింది. అలాగే అవసరమైన అనుమతులు తెచ్చుకునేందుకు నెల రోజులు గడువు ఇచ్చింది. ఇవాళ మంత్రి పేర్ని నానితో ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి, సినిమా థియేటర్స్ యజమానులు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా థియేటర్ ఓనర్లతో మంత్రి మాట్లాడుతూ... థియేటర్లు ఓపెన్ చేసుకుని నెలలోగా అసవరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కు పెనాల్టీ కట్టి దరఖాస్తు చేసుకోవాలని థియేటర్ల యజమానులకు మంత్రి సూచించారు.
