ఏపీలో 10,167 కేసులు నమోదు

ఏపీలో 10,167 కేసులు నమోదు
  • మొత్తం 1,30,557కి చేరిన కేసుల సంఖ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజుకు దాదాపు10 వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 10, 167 కేసులు నమోదైనట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,30,557కి చేరుకుంది. 24 గంటల్లో 68 మంది చనిపోయారు.. దీంతో చనిపోయిన వారి సంఖ్య 1281కి చేరింది. కరోనా బారిన పడి తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, అనంతపూర్‌‌లో ఎనిమిది మంది, కర్నూలులో ఎనిమిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, చిత్తూర్‌‌లో ఆరుగురు, కడపలో ఆరుగురు, ప్రకాశంలో నలుగురు, విజయనగరంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు 18,90,077 శ్యాంపిల్స్‌ను పరీక్షించినట్లు అధికారులు ప్రకటించారు. 24 గంటల్లో 70,068 మందికి పరీక్షలు చేశారు.