
- 96,298కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
- 1,041 మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజు వేలకు వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా వెయ్యి దాటింది. 24 గంటల్లో 47, 645 శ్యాంపిల్స్‌ను పరీక్షిస్తే 7,627 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96298కి చేరింది. వారిలో ఇప్పటి వరకు 46301 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 48956మంది వివిధ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు 1041 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. ఒక్క రోజులో కరోన వల్ల తూర్పలు గోదావరి జిల్లాలో 9 మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, కర్నూలులో 6గురు, కృష్ణలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, విజయనగరంలో ముగ్గురు, అనంతపూర్‌లో, కడపలో ఇద్దరు చొప్పున చనిపోయారు. గుంటూరులో, ప్రకాశంలో ఒక్కోరు చనిపోయారు. ఇప్పటి వరకు 16,43,319 టెస్టలు చేశారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు