ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 87 మంది మృతి చెందినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 9,113 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,44,549 కు చేరింది. 1,54,749 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 2203 కు చేరింది.
కరోనా బారిన పడి మంగళవారం..అనంతపూర్‌లో 13 మంది, చిత్తూరులో 12 మంది, గుంటూరులో 9 మంది, ప్రకాశంలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఏడుగురు, కడపలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు మరణించారు.

