కెనడాలో ఏపీ స్టూడెంట్‌ మృతి

కెనడాలో ఏపీ స్టూడెంట్‌ మృతి

మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్): కెనడాలోని సిల్వర్‌‌ జలపాతంలో ఈతకి వెళ్లి ఏపీకి చెందిన స్టూడెంట్‌ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. మచిలీపట్నంలోని చింతగుంటపాలెంకు చెందిన పోలూకొండ లెనిన్ నాగకుమార్‌‌ (23) 2021లో ఎంఎస్ చదవడానికి కెనడా వెళ్లాడు. ప్రస్తుతం అతని చదువు పూర్తి కావడంతో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అంటారియోలోని థండర్‌‌ బేలో ఫ్రెండ్స్‌తో ఉంటూ ఓ రెస్టారెంట్‌లో సూపర్‌‌వైజర్‌‌గా పనిచేస్తున్నాడు. 

ఈ క్రమంలో తన ముగ్గురు రూమ్మెంట్స్‌తో కలిసి మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో (ఇండియా టైమ్‌ ప్రకారం) తాను నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్వర్‌‌ జలపాతంలో ఈత కొట్టడానికి వెళ్లారు. జలపాతం లోతు తెలుసుకోకుండా దిగడంతో నాగ కుమార్‌‌తో అతని ఫ్రెండ్‌ అందులో చిక్కుకున్నారు. అయితే, అతని ఫ్రెండ్‌ ఎలాగోలా బయటకు రాగా, నాగ కుమార్ కుమార్‌‌ మాత్రం మరింత లోతుకు వెళ్లి తిరిగి రాలేకపోయాడని అతని మామ నూతన్‌ కుమార్‌‌ తెలిపారు.