
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో 80% మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ర్టీమ్‌లో 86% మంది క్వాలిఫై అయ్యారు. గురువారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జవ హర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సి టీలో ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పోయినేడాది మాదిరిగానే ఈసారి కూడా మెజార్టీ టాప్ ర్యాంకులు ఏపీ స్టూడెంట్లు దక్కించుకున్నారు. ఇంజినీరింగ్‌లో టాప్ 10లో తెలంగాణ స్టూడెంట్లు ఇద్దరే ఉండగా, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ర్టీమ్ టాప్10లో ముగ్గురు మా త్రమే ఉన్నారు. మిగిలిన ర్యాంకులన్నీ ఏపీ స్టూడెంట్లే సాధించారు. ఇక ఈసారి కూడా అమ్మాయిలు తమ హవా కొనసాగించారు.
ఇంజినీరింగ్ లో అబ్బాయిలు 79% మంది క్వాలిఫై కాగా, అమ్మాయిలు 82% మం ది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ స్ర్టీమ్‌లో అబ్బాయిలు 84 శాతం మంది అర్హత సాధించగా, అమ్మాయిలు 87శాతం మంది అర్హత సాధించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. 85% సీట్లను తెలంగాణ స్టూడెంట్లకు, 15% ఓపెన్ కేటగిరీ (ఏపీ, తెలంగాణ)లో కేటాయిస్తామని తెలిపారు. రిజల్ట్స్ eamcet.tsche.ac.in వెబ్ సైట్ లో చూడొచ్చని వెల్లడించారు. ప్రోగ్రామ్‌లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్ అధికారులు దీన్ కుమార్, విజయకుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఎంసెట్‌లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ స్టూడెంట్లకు మూడు మార్కులు కలిపారు. ఈనెల 14న జరిగిన 5, 6 సెషన్ల స్టూడెంట్లకు ఈ మార్కులు యాడ్ చేసినట్టు ఎంసెట్ కోకన్వీనర్ విజయకుమార్ రెడ్డి చెప్పారు.
ఏ స్ర్టీమ్ లో ఎంతమంది?
ఇంజినీరింగ్ స్ర్టీమ్‌లో 2,05,351 మంది రిజిస్టర్ చేసుకోగా 1,95,275 మంది పరీక్ష రాశారు. వీరిలో 1,56,879 మంది క్వాలిఫై అయ్యారు. వీళ్లలో అబ్బాయిలు 94,065 మంది ఉండగా, అమ్మాయిలు 62,814 మంది ఉన్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 1,15,332 మంది
రిజిస్టర్ చేసుకోగా 1,06,514 మంది పరీక్ష రాశారు. వీరిలో 91,935 మంది క్వాలిఫై అయ్యారు. వీళ్లలో అమ్మాయిలు 65,163 మంది, అబ్బాయిలు 26,772 మంది ఉన్నారు.
అనిరుధ్‌కు 158.89 మార్కులు..
ఇంజినీరింగ్ విభాగంలో ఏపీకి చెందిన అనిరుధ్ అత్యధికంగా 160కి గాను 158.89 మార్కులు సాధించాడు. వెంకట మణిందర్ రెడ్డి 158.59, ఉమేశ్ వరుణ్ 156.94, అభినిత్ 156.58, ప్రమోద్ 156.01 మార్కులు సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో ఏపీకి చెందిన సత్యరాజ జశ్వంత్ అత్యధికంగా 155.08 మార్కులు సాధించాడు. వెంకట్ తేజ 154.60, సఫల్ లక్ష్మీ 154.52, కార్తికేయ రెడ్డి 153.57, వరుణ్ చక్రవర్తి 152.63 మార్కులు సాధించారు.
ఇంజినీరింగ్ టాపర్లు..
1. సనపల అనిరుధ్ (విశాఖపట్నం)
2. ఎక్కంటిపాని వెంకట మణిందర్ రెడ్డి (గుంటూరు)
3. చల్లా ఉమేశ్ వరుణ్ (నందిగామ)
4. అభినిత్ మాజేటి
(కొండాపూర్, హైదరాబాద్)
5. పొన్నతోట ప్రమోద్‌కుమార్ రెడ్డి
(తాడిపత్రి, అనంతపురం)
6. మారదన ధీరజ్ (విశాఖపట్నం)
7. వడ్డే శాన్విత (నల్గొండ)
8. బోయిన సంజన (శ్రీకాకుళం)
9. ప్రిన్స్ బ్రన్హమ్ రెడ్డి (నంద్యాల)
10. మీసాల ప్రణతి శ్రీజ (విజయనగరం)
అగ్రికల్చర్ అండ్ మెడికల్ టాపర్లు
1. బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్ (తూర్పుగోదావరి)
2. నశిక వెంకటతేజ (చీరాల, ప్రకాశం)
3. సఫల్‌లక్ష్మి పసుపులేటి
(సరూర్‌నగర్, రంగారెడ్డి)
4. దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి, గుంటూరు)
5. బోర వరుణ్ చక్రవర్తి (శ్రీకాకుళం)
6. శశిధర్ రెడ్డి (బాలానగర్, రంగారెడ్డి)
7. వి.హర్షిల్ సాయి (నెల్లూరు)
8. డి.సాయి చిద్విలాస్ రెడ్డి (గుంటూరు)
9. జి.వర్షిత (అనంతపురం)
10. కె.ప్రీతమ్ సిద్ధార్థ్
(హిమాయత్ నగర్, హైదరాబాద్)