
- పెరిగిన గ్రౌండ్ వాటర్
- రూ. 7లక్షల వరకు ఆదా
పద్మారావునగర్, వెలుగు: సమ్మర్ లో నీటి ఎద్దడితో కష్టాలు పడిన అపార్ట్మెంట్ వాసులు ఇంకుడు గుంతలు తీసుకుని ఆదర్శంగా నిలిచారు. బన్సీలాల్పేట డివిజన్బోయిగూడ వై జంక్షన్ వద్ద ఎంఎన్కే విఠల్ సెంట్రల్కోర్టు అపార్ట్ మెంట్లో 90 ప్లాట్లలో 300 మంది నివసిస్తున్నారు. ప్రతి సమ్మర్ లో నీటి కష్టాలతో ఇబ్బందులు పడుతూ ట్యాంకర్లపై ఆధారపడేవారు. నీటి కష్టాలను అధిగమించేందుకు అపార్ట్ మెంట్వెల్ఫేర్ ప్రెసిడెంట్జి.హనుమాండ్లు ఆలోచనకు అండగా నిలిచారు.
మూడేండ్ల కిందట రెండు ఇంజక్షన్ల బోర్ల చుట్టూ రెండు భారీ ఇంకుడు గుంతలను నిర్మించారు. వీటికి తోడుగా మరో 16 ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. దీంతో వానాకాలంలో అపార్ట్ మెంట్ ఆవరణలో కురిసిన వాననీరు వృథాగా పోకుండా18 ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రౌండ్ వాటర్ పెరిగి, సమ్మర్ లో వాటర్ ప్రాబ్లమ్ కు చెక్ పడిందని ప్రెసిడెంట్హనుమాండ్లు తెలిపారు. ప్రతి సమ్మర్ లో రూ. 7 లక్షల వరకు వాటర్ ట్యాంకర్లకు ఖర్చు అయ్యేది తప్పిందని పేర్కొన్నారు.