
హైదరాబాద్, వెలుగు: అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కంపెనీ అపోలో ఆయుర్వైద్ హాస్పిటల్స్, తమ అతిపెద్ద ప్రెసిషన్ ఆయుర్వేద హాస్పిటల్స్ నెట్‌వర్క్‌ను తెలంగాణకు విస్తరిస్తూ కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. హెచ్సీఏహెచ్ సువిటాస్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని సోమాజిగూడలో "ఆయుర్వైద్ హెచ్సీఏహెచ్ సెంటర్ ఫర్ ప్రెసిషన్ ఆయుర్వేద అండ్ ఇంటెగ్రేటివ్ మెడిసిన్"ను ప్రారంభించింది. ఇది న్యూరో రిహాబిలిటేటివ్ కేర్ కోసం ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇక్కడ మొత్తం 115 బెడ్లు ఉంటాయి.
ఆయుర్వేద చికిత్సల కోసం ప్రత్యేకంగా 20 బెడ్లు కేటాయించారు. ఈ మల్టీడిసిప్లినరీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, న్యూరాలజీ, న్యూరోడీజెనరేటివ్ డిజార్డర్స్, మస్కులోస్కెలెటల్ డిజార్డర్స్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి ప్రత్యేకమైన చికిత్సలు అందిస్తుంది. మెటబాలిక్ డిజార్డర్స్, గైనకాలజీ, జీఐ, రెస్పిరేటరీ, మానసిక ఆరోగ్యం లాంటి అన్ని ప్రధాన వైద్య విభాగాలలోనూ ఆయుర్వేద వైద్య సేవలను అందిస్తుంది.
మొండి గాయాలు, మొలలు (పైల్స్), ఫిస్టులా లాంటి సమస్యలకు ఆయుర్వేద -సర్జికల్ విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పిల్లల అభివృద్ధి లోపాలు, వృద్ధాప్య సంరక్షణపై సైతం ఇక్కడ దృష్టి పెడతారు.