మలయాళ స్టార్ మోహన్ లాల్ లీడ్‌గా నంద కిషోర్ రూపొందించిన చిత్రం ‘వృషభ’. సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, నేహా సక్సేనా, రామచంద్రరాజు కీలకపాత్రలు పోషించారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌తో కలిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్ నిర్మించింది. డిసెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం (DEC 13) ఈ మూవీ నుంచి ‘అప్పా’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘పది నెలలు నిను మోయలేదు కానీ.. బ్రతుకంతా నిన్ను భుజాలపై మోయగలను.. నువ్వే నా ఊపిరి.. నువ్వే నా లోకము.. నువ్వే నేనంటూ బ్రతికే ఓ పిచ్చి తండ్రినేరా.. నాన్నగా నువ్వే నా గెలుపు..’ అంటూ తండ్రీకొడుకుల మధ్య సాగిన పాట ఎమోషనల్‌గా సాగింది.
శ్యామ్ సిఎస్ కంపోజ్ చేసిన ఈ మెలోడీకి కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని లిరిక్స్ రాయగా, విజయ్ ప్రకాష్ పాడిన తీరు ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని బంధాలు, త్యాగాలు ఆడియెన్స్‌కు గొప్పగా కనెక్ట్ అవుతాయని దర్శకుడు నంద కిషోర్ అన్నాడు. లార్జర్ దేన్ లైఫ్ డ్రామాతో గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత ఏక్తా కపూర్ అన్నారు.

