మీ ఐఫోన్లు హ్యాక్ చేస్తున్నారు.. అలర్ట్ ఇచ్చిన కంపెనీ

మీ ఐఫోన్లు హ్యాక్ చేస్తున్నారు.. అలర్ట్ ఇచ్చిన కంపెనీ

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, శశి థరూర్‌లతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు తమ ఫోన్‌లు, మెయిల్‌లకు యాపిల్ నుంచి హెచ్చరిక సందేశాలు వచ్చాయని ఆరోపించారు. వారి ఐఫోన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా చర్యలు జరిగినట్టు వారు తెలిపారు.

కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, శశి థరూర్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులతో సహా ప్రతిపక్ష భారత కూటమికి చెందిన ఇతర నేతలపై మెుయిత్రా ట్వీట్‌లో ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయానికి కూడా యాపిల్ నుంచి హెచ్చరిక సందేశాలు వచ్చాయి.

Also Read : లిఫ్ట్ లో పెంపుడు కుక్క.. మహిళను కొట్టిన రిటైర్డ్ IAS అధికారి

తమ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా వారికి ఫోన్, మెయిల్ కి వచ్చిన మెసేజ్ ల స్క్రీన్‌షాట్‌లను అక్టోబర్ 30న రాత్రి రిలీజ్ చేశారు. "స్టేట్-స్పానర్సర్డ్ దుండగులు మీ ఐఫోన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చు" అని, ప్రియాంక చతుర్వేది, ఆప్ ఇండియా బ్లాక్‌కు చెందిన మరో ముగ్గురికి తమ ఫోన్‌లు, మెయిల్‌లకు ఒకే రకమైన మెసేజ్ లు వచ్చాయని మొయిత్రా చెప్పారు.

"ప్రభుత్వం నా ఫోన్, మెయిల్‌లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని హెచ్చరిస్తూ యాపిల్ నుంచి టెక్స్ట్, మెయిల్ వచ్చింది" అని, తనతో పాటు మరో ముగ్గురు భారతీయులు ఈ తరహా సందేశాలను అందుకున్నారని మొయిత్రా ట్వీట్ లో తెలిపింది.  ప్రియాంక చతుర్వేది సైతం దీనిపై స్పందించారు. తనక్కూడా అదే సందేశం వచ్చిందని, ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తుందా అని ప్రశ్నించారు.