యాపిల్ సీఈఓ జీతంలో 400 కోట్లు కట్

యాపిల్ సీఈఓ జీతంలో 400 కోట్లు కట్

ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్.. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ శాలరీని తగ్గించనుంది. జీతాల విషయంలో యాపిల్ షేర్ హోల్డర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో టిమ్ కుక్ శాలరీని తగ్గించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 10న జరగనున్న ఇన్వెస్టర్ డేలో షేర్ హోల్డర్ల పర్మిషన్ అనంతరం నిర్ణయం అమలుకానుంది. బోర్డ్ మెంబర్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టిమ్ కుక్ స్వాగతించారు. 

గతేడాది 99 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 700 కోట్లు) వార్షిక వేతనం తీసుకున్న టిమ్.. కంపెనీ తాజా నిర్ణయంతో 49 మిలియన్ డాలర్లు మాత్రమే అందుకోనున్నాడు. అంటే గతేడాదితో పోలిస్తే ఆయన జీతం దాదాపు రూ.400 కోట్ల వరకు తగ్గనుంది. గతంలో 99 మిలియన్ డాలర్లలో 83 మిలియన్ డాలర్లు స్టాక్ అవార్డ్స్ గా, 15 మిలియన్ డాలర్లు ఇన్ సెంటివ్స్ గా అందుకున్నాడు. వీటితో పాటు రిటైర్‌మెంట్‌ ప్లాన్ లో భాగంగా కాంపెన్సేషన్, సెక్యూరిటీ, ఫ్లైట్ జర్నీ, టూర్ ప్యాకేజీల రూపంలో 46,000 డాలర్లు అందుకున్నారు. అయితే, షేర్ హోల్డర్ల నిర్ణయంతో ఇన్ సెంటివ్స్ లో కూడా భారీ కోత ఉండబోనుంది. యాపిల్ జరిపిన సే ఆన్ పే ఓటింగ్ లో 95 శాతం మంది షేర్ హోల్డర్లు శాలరీ తగ్గించాలని ఓట్ వేశారు.