యాపిల్ స్టోర్స్లో ఉద్యోగాలు...వారానికి 40 గంట‌లే పని

యాపిల్ స్టోర్స్లో ఉద్యోగాలు...వారానికి 40 గంట‌లే పని

భారత్‌లో త్వరలోనే రిటైల్‌ స్టోర్లను తెరిచేందుకు యాపిల్‌ కంపెనీ సిద్ధమైంది. తొలుత ముంబై, ఢిల్లీలో స్టోర్లను ప్రారంభించనుంది. అప్‌క‌మింగ్ రిటైల్ స్టోర్స్‌లో ప‌లు జాబ్ ఓపెనింగ్స్‌ను యాపిల్ త‌న వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. టెక్నికల్‌ స్పెషలిస్టు, బిజినెస్‌ ఎక్స్‌పర్ట్‌, సీనియర్‌ మేనేజర్‌, స్టోర్‌ లీడర్‌, జీనియస్‌ పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ మొదలుపెట్టింది. యాపిల్ ఇండియా రిటైల్ స్టోర్స్‌లో ప‌నిచేసే ఉద్యోగులు వారానికి 40 గంట‌లు ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని కంపెనీ ప్రకటించింది. అభ్య‌ర్ధుల‌కు ఇంగ్లీష్‌తో పాటు స్ధానిక భాష‌పై ప‌ట్టు ఉండాల‌ని సూచించింది. ఇక జాబ్ పోస్టింగ్స్‌లో జీతాల గురించి ఎలాంటి ప్ర‌స్తావ‌న లేదు.

2020లో యాపిల్ భార‌త్‌లో త‌న అధికారిక ఈ – స్టోర్‌ లాంచ్ చేసింది. 2021లోనే ముంబైలో తొలి రిటైల్ ఔట్ లెట్ ప్రారంభించాలనుకున్నా కోవిడ్ కారణంగా అది ఆలస్యమైంది. చైనాలో కొవిడ్‌ చ‌ట్టాలు క‌ఠినంగా అమ‌లవుతున్న  క్రమంలో భార‌త్‌ను ప్రొడక్షన్ హ‌బ్‌ల‌లో ఒక‌టిగా మ‌లిచేందుకు యాపిల్ ప్లాన్ చేస్తోంది. చైనా త‌ర్వాత భార‌త్‌, వియ‌త్నాంల్లో త‌న ప్రొడక్షన్ యూనిట్లను విస్తరించేందుకు యాపిల్ కసరత్తు చేస్తోంది.