వైన్స్కు 50 వేలు దాటిన అప్లికేషన్లు..ఇయ్యాల్నే (అక్టోబర్ 18 ) ఆఖరు తేదీ

వైన్స్కు 50 వేలు దాటిన అప్లికేషన్లు..ఇయ్యాల్నే (అక్టోబర్ 18 ) ఆఖరు తేదీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 2,620 వైన్స్ షాపులకు శుక్రవారం ఒక్కరోజే 25 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో వైన్స్​కు మొత్తం అప్లికేషన్ల సంఖ్య 50 వేలు దాటింది. శనివారంతో దరఖాస్తులకు గడువు ముగియనుంది. చివరి రోజున ఇంకో 50 వేల దాకా దరఖాస్తులు రావచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి అప్లికేషన్లు గరిష్టంగా లక్షకు చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కో అప్లికేషన్​కు రూ.3 లక్షలు ఫీజు కాగా, అప్లికేషన్ ఫీజులతోనే దాదాపు రూ.3 వేల కోట్ల దాకా సర్కారుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.