హైదరాబాద్, వెలుగు: గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–-2025 కోసం ఆప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్టు రాజ్ భవన్ వెల్లడించింది. మహిళా సాధికారత , గిరిజన అభివృద్ధి , రూరల్ హెల్త్ అండ్ మెడికల్ ఫిలాంత్రపీ, కార్పొరేట్ వాలంటీరింగ్ అనే నాలుగు రంగాలలో కనీసం ఐదేండ్లకు (2020 నుంచి) తగ్గకుండా విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలు, సంఘాలు, ట్రస్టులు తమ నామినేషన్లను సమర్పించవచ్చు. ప్రతి విభాగంలో వ్యక్తులకు, సంస్థల/సంఘాల/ట్రస్టులకు రెండు విభాగాలుగా ఈ అవార్డులను ఇవ్వనున్నారు.
ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటలు చివరి తేదీగా ఉంది. మరిన్ని వివరాల కోసం గవర్నర్ అధికారిక వెబ్‌సైట్ https://governor.telangana.gov.in ను సందర్శించాలని శనివారం రిలీజ్ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.
