ఆఫీస్‌‌లో ఉన్నా సన్‌‌స్క్రీన్‌‌ రాసుకోవాలి

ఆఫీస్‌‌లో ఉన్నా సన్‌‌స్క్రీన్‌‌ రాసుకోవాలి

ఎండ నుంచి చర్మాన్ని కాపాడుతుందని సన్‌‌స్క్రీన్ వాడుతుంటారు. అందుకే బయటికి వెళ్లేటప్పుడు చర్మానికి సన్‌‌స్క్రీన్‌‌ రాసుకుంటుంటారు. బయటికి వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌‌లో ఉన్నా సన్‌‌స్క్రీన్‌‌ రాసుకోవాలి అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్​. ఓజోన్ పొర నుంచి వచ్చే హానికరమైన యూవీ కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. అది సన్‌‌బర్న్‌‌కు కారణం అవుతుంది. దీనివల్ల చర్మంపై మొటిమలు, దురద, దద్దుర్లు వస్తాయి. సూర్య కిరణాలు, ఫ్లోరోసెంట్, బ్లూ లైట్స్‌‌ వల్ల ముఖానికి అయ్యే నష్టాన్ని ఫోటో ఏజింగ్‌‌ అంటారు.

ఇవి కంప్యూటర్‌‌‌‌, మొబైల్‌‌ ఎక్కువగా వాడేవాళ్లలో కూడా వచ్చే అవకాశం ఉందని కొన్ని స్టడీల్లో తేలింది. అంతేకాకుండా వీటివల్ల చర్మ క్యాన్సర్‌‌‌‌ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సూర్య కిరణాలు, ఫ్లోరోసెంట్, బ్లూ లైట్​ఎక్స్‌‌పోజ్‌‌  మెలస్మాకి కారణం. ముఖంపైన వచ్చే నలుపు, గోధుమ రంగు మచ్చలను మెలస్మా అంటారు.వీటి బారిన పడకుండా చర్మాన్ని రక్షిస్తుంది సన్‌‌స్క్రీన్‌‌. ఎస్‌‌పిఎఫ్‌‌ ఎక్కువగా ఉన్న సన్‌‌స్క్రీన్‌‌లు వాడితే ఇంకా మంచిది.