9 మంది సుప్రీంకోర్టు జడ్జీల నియామకం.. కేంద్రం గెజిట్ విడుదల

9 మంది సుప్రీంకోర్టు జడ్జీల నియామకం.. కేంద్రం గెజిట్ విడుదల

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీల నియమాకంపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈనెల 18న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం 9 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. బార్ బెంచ్ కి ఒకరు, ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కలిపి మొత్తం 9 మంది కొత్త జడ్జీల నియామకానికి సిఫారసు చేయగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది.

సుప్రీంకోర్టు కొత్త జడ్జీలలో  తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లికి పదోన్నతిపై నియమితులు కాగా మిగిలిన వారు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఏఎస్ ఓఖా, జస్టిస్ విక్రమ్ నాథ్ ల నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.