
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో చీఫ్ విప్, విప్ లను ఖరారు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద రావు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించబడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డిలు ప్రభుత్వ విప్ లుగా నియమితులయ్యారు. ఈ నియామకాలు ఫిబ్రవరి 11 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ ఛైర్మన్ గా బండా ప్రకాశ్ నామినేషన్ దాఖలు చేశారు. మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021 జూన్ 3న పూర్తయింది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. ఈనేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. 12న ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేసి బాధ్యతలు అప్పగించనున్నారు. బండా ప్రకాశ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి.