సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఖాళీలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఖాళీలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌‌‌‌మెంట్ (రిక్రూట్‌‌‌‌మెంట్ అండ్‌‌‌‌ ప్రమోషన్ డివిజన్) సెంట్రల్ ఆఫీస్ దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సీబీ శాఖల్లో 3000 అప్రెంటిస్‌‌‌‌షిప్‌‌‌‌ ట్రైనింగ్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెలెక్షన్: ఆన్‌‌‌‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఆబ్జెక్టివ్‌‌‌‌ విధానంలో ఉంటుంది. 1. క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ 2. బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్ 3. బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్ 4. బేసిక్ ఇన్‌‌‌‌వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రొడక్ట్స్ 5. బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్​లైన్​ పరీక్ష మార్చి 10న నిర్వహిస్తారు.