
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఏడు మెడికల్ కాలేజీలు, 15 నర్సింగ్ కాలేజీల్లో ఔట్ సోర్సింగ్ సర్వీస్ పోస్టులను సర్కార్ మంజూరు చేసింది. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు పర్మిషన్ ఇస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీల్లో మొత్తం 2,135 రకాల సర్వీస్ పోస్టులు రిక్రూట్ చేయనున్నారు. అలాగే నర్సింగ్ కాలేజీల్లో 900 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. థర్డ్ పార్టీ ఏజేన్సీ ద్వారా ఔట్సోర్సింగ్ పద్ధతిలో వీటిని భర్తీ చేయనున్నారు.