Sri Lanka Cricket: శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా పాకిస్థాన్ దిగ్గజ బౌలర్

Sri Lanka Cricket: శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా పాకిస్థాన్ దిగ్గజ బౌలర్

శ్రీలంక క్రికెట్ (SLC) తమ కొత్త ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్థాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్‌ను నియమిస్తున్నట్లు శనివారం (మార్చి 16) ప్రకటించింది. జావేద్ తక్షణమే బౌలింగ్ కోచ్ పదవిగా బాధ్యతలు స్వీకరిస్తాడని.. జూన్ 2024 లో వెస్టిండీస్, USAలో జరగనున్న టీ20వరల్డ్ కప్ ముగిసేవరకు జాతీయ జట్టులో ఉంటాడని తెలిపింది. ప్రస్తుతం శ్రీలంక బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఆడుతుంది. శ్రీలంక క్రికెట్‌ బౌలింగ్ కోచ్ గా ఆకిబ్ జావేద్‌ జట్టుతో చేరనుండడంతో మేము సంతోషిస్తున్నాము" అని శ్రీలంక క్రికెట్ CEO ఆష్లే డిసిల్వా తన అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఆకిబ్ జావేద్‌ 1992 లో పాకిస్థాన్ వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 51 ఏళ్ల ఈ మాజీ పాక్ ఫాస్ట్ బౌలర్ కెరీర్ లో 22 టెస్టుల్లో 54 వికెట్లు, 163 వన్డేల్లో 182 వికెట్లు ఉన్నాయి. జావేద్ తన జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పని సేవలను అందించడంతో పాటు UAE జట్టు ప్రధాన కోచ్‌గా పని చేశాడు. యుఎఇతో జావేద్ పదవీకాలం అత్యంత విజయవంతమైంది. అతను కోచ్ గా ఉన్న సమయంలో UAE వన్డే, టీ20 హోదా సాధించింది. 2009లో పాకిస్థాన్ టీ 20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకి ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నాడు. 

వెస్టింసీడ్, అమెరికా వేదికగా 2024 టీ20 ప్రపంచ కప్ జరగనుంది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ జూన్ 29 న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.