న్యూఢిల్లీ: ఏరోస్పేస్ భాగాలు, కన్జూమర్ డ్యూరబుల్ గూడ్స్ కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఏక్వస్ ఐపీఓ వచ్చేనెల 3–5 తేదీల్లో ఉంటుంది. ఇందులో రూ.670 కోట్ల విలువైన ఫ్రెష్ఇష్యూ, 2.03 కోట్ల షేర్ల ఓఎఫ్ఎస్ ఉంటుంది.
కొత్త ఇష్యూ నుంచి వచ్చే నిధులను అప్పుల చెల్లింపు, యంత్రాల కొనుగోలు, విస్తరణ కోసం ఉపయోగిస్తారు. ఈ సంస్థకు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్, అమికస్ క్యాపిటల్, అమన్సా క్యాపిటల్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్, కటమరన్ వంటి ప్రముఖ పెట్టుబడిదారులు మద్దతు ఇస్తున్నారు.
ఎయిర్‌బస్, బోయింగ్ దాని ప్రధాన క్లయింట్లు. కంపెనీకి భారతదేశంతోపాటు (బెళగావి, హుబ్బళ్లి, కొప్పల్), ఫ్రాన్స్, యూఎస్ఏలో తయారీ కేంద్రాలు ఉన్నాయి.
