సీఎం రేవంత్‎ను కలిసిన ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ గోల్డ్‌ మెడలిస్ట్ చికిత

సీఎం రేవంత్‎ను కలిసిన ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ గోల్డ్‌ మెడలిస్ట్ చికిత

సుల్తానాబాద్, వెలుగు: ఇటీవల కెనడాలో జరిగిన మహిళా ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన చికిత సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చికితను సీఎం, ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, మెమొంటో అందించారు. చికిత ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించేలా ప్రభుత్వం తరఫున ట్రైనింగ్‌ ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వారి వెంట ఎమ్మెల్సీ టి. భాను ప్రసాద్‌రావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, కరీంనగర్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌రావు ఉన్నారు.