అయోధ్యలో నిర్మించబోయే మసీదు, ఆస్పత్రి నమూనాలివే..

అయోధ్యలో నిర్మించబోయే మసీదు, ఆస్పత్రి నమూనాలివే..

అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అమోదం తెలిపిన సుప్రీంకోర్టు.. ముస్లీంల కోసం మసీదును కూడా కట్టాలని ఆలయ ట్రస్ట్‌ను ఆదేశించింది. మసీదు కోసం అయోధ్యకు 18 కి.మీ. దూరంలోని ధన్నీపూర్‌లో 5 ఎకరాల స్థలం కేటాయించింది. అక్కడ మసీదుకు పక్కన ఆస్పత్రి నిర్మాణం కూడా జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మసీదును మొదటి దశలో నిర్మించాలని ట్రస్ట్ భావిస్తోంది. అందుకోసం వచ్చే ఏడాది జనవరిలో శంఖుస్థాపన చేయాలని ట్రస్ట్ అనుకుంది. అయితే మసీదు, ఆస్పత్రి నమూనాలకు అనుమతులు ఇంకా రాలేదు. దాంతో శంఖుస్థాపన వచ్చే ఏడాది ఆగష్టు 15కు మారే అవకాశముందని ట్రస్ట్ తెలిపింది. రెండవ దశలో ఆస్పత్రిని నిర్మించనున్నట్లు ట్రస్ట్ తెలిపింది. మసీదుకు సంబంధించిన నమూనాను ప్రొఫెసర్ ఎస్.ఎమ్. అక్తర్ లక్నోలోని ఐఐసిఎఫ్ ట్రస్ట్ కార్యాలయంలో సమర్పించారు. ఈ మసీదుకు ఇంకా ఎటువంటి పేరు నిర్ణయించలేదని మరియు ఏ చక్రవర్తి లేదా రాజు పేరు పెట్టబోమని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసిఎఫ్) ట్రస్ట్ తెలిపింది. ఈ మసీదు నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మసీదుల నమూనాలను ట్రస్ట్ పరిశీలించింది. దీర్ఘవృత్తాకారంలో ఉండే ఈ మసీదులో రెండు అంతస్థులలో ప్రార్థనామందిరాలుంటాయి. ఈ మసీదులో ఒకేసారి దాదాపు 2 వేలమంది నమాజ్ చేసుకోవచ్చు. అలాగే ఆస్పత్రి కూడా 200 పడకలతో నిర్మితమవుతోంది.

రామ్ మందిర్ ఆలయానికి ఈ ఏడాది ఆగష్టులో ప్రధాని మోడీ భూమి పూజ నిర్వహించారు. ఈ భూమి పూజ కోసం మోడీ దాదాపు 29 సంవత్సరాల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టారు. భూమి పూజ సందర్భంగా ఆయన వెండి ఇటుకను పునాది రాయిగా వేశారు.

For More News..

ఆమెకు 15.. అతనికి 16.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని సూసైడ్

రేపు పబ్లిక్‌‌గా వ్యాక్సిన్ తీసుకుంట: జో బైడెన్

దేశంలో కరోనా సెకండ్​వేవ్​ రాదు