ప్రొటీన్​ షేక్స్​ ఆరోగ్యానికి మంచివేనా?

ప్రొటీన్​ షేక్స్​ ఆరోగ్యానికి మంచివేనా?

బరువు తగ్గడానికి, కండరాల బలానికి, రక్తంలోని షుగర్​ లెవల్స్​ని కంట్రోల్ చేయడానికి, రోగ నిరోధక శక్తికి, ఆరోగ్యమైన చర్మం కోసం.. ఇలా మరెన్నింటికో ప్రొటీన్​ అవసరం. ఇది ఫుడ్​లో సరిపడా దొరుకుతున్నప్పటికీ.. చాలామంది  ముఖ్యంగా జిమ్​ చేసేవాళ్లు ప్రొటీన్​ షేక్స్​ వైపే చూస్తున్నారు. మరి ఇవి ఆరోగ్యానికి మంచివేనా?  ప్రొటీన్​ ఫుడ్​ కంటే  శరీరానికి మేలు చేస్తాయా? అంటే  కాదంటుంది న్యూట్రిషనిస్ట్ దీప్తి లోకేశప్ప.

మోతాదు మించితే.. 

ప్రొటీన్​ షేక్స్​ తాగడం వల్ల చాలాసేపటి వరకు కడుపునిండుగా ఉంటుంది. దానివల్ల త్వరగా ఆకలి  వేయదు. ఫలితంగా బరువు తగ్గడం ఈజీ అవుతుంది. వర్కవుట్స్​ తర్వాత ప్రొటీన్​ షేక్స్​ తాగితే ఇన్​స్టంట్​ ఎనర్జీ వస్తుందనేది  కొందరి మాట. అలాగే ప్రొటీన్​ షేక్స్​, సప్లిమెంట్స్​ తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. పైగా వీటిని తేలిగ్గా తీసుకోవచ్చు అన్న ఆలోచనతో చాలామంది వీటికి అలవాటు పడుతున్నారు. మరి, ఇవి ప్రొటీన్​ ఫుడ్​ కన్నా బెటర్​ ఆప్షనా అంటే కాదు. అందుకే ఎప్పుడో ఒకసారి అయితే ఒకే.  కానీ, ప్రొటీన్​ కోసం పూర్తిగా వీటిపైనే ఆధారపడకూడదు. హెల్దీ ప్రొటీన్​ కేవలం ఫుడ్​ ద్వారానే అందుతుందని గుర్తుంచుకోవాలి. అలాగే ప్రొటీన్​ షేక్స్​ని​ ఎక్కువగా తాగడం వల్ల యాక్నె సమస్యలొస్తాయి స్టడీలు చెప్తున్నాయి. వీటిల్లో లాక్టోఫెరిన్​ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది. ఇది జీర్ణక్రియలో ఇబ్బందికి కారణం అవుతుంది. అలాగే మార్కెట్​లో ఉన్న చాలా ప్రొటీన్​ పౌడర్స్ తయారీలో కాడ్మియం, ఆర్సెనిక్​, మెర్క్యురీ లాంటి హానికారక కెమికల్స్​ ఉన్నాయి. ఇవి తలనొప్పి , కండరాలు, కీళ్ల నొప్పులు, మలబద్ధకం లాంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అన్నింటికి మించి వర్కవుట్​ చేసిన వెంటనే  ప్రొటీన్​ షేక్స్​ తాగితే ఇన్సులిన్​ శాతం పెరుగుతుంది. అందుకే నేచురల్​గా దొరికే ఫుడ్​ ద్వారానే శరీరానికి ప్రొటీన్​ ఇవ్వాలి. అందుకోసం ఇవి తినాలి.

రోజూ ఇవి తినాలి 

  • వంద గ్రాముల చికెన్​లో దాదాపు ఇరవై  గ్రాముల ప్రొటీన్​ ఉంటుంది. రోజుకొక ఉడకబెట్టిన గుడ్డు తింటే ప్రొటీన్​తో పాటు శరీరానికి అవసరమయ్యే అమైనో యాసిడ్స్​ కూడా అందుతాయి. అలాగే ఒక  కేజీ సాల్మన్​ చేపల్లో దాదాపుగా 200 గ్రాముల ప్రొటీన్​తో పాటు ఒమెగా– 3 ఫ్యాటీ యాసిడ్స్​ కూడా పుష్కలంగా ఉంటాయి. 
  • పల్లీలు, పీనట్​ బటర్​, బాదం, వాల్​నట్స్​, జీడిపప్పు , నువ్వులు, చియా సీడ్స్​ , అవిసెలు, పాలు, ఆకుకూరలు రెగ్యులర్​ డైట్​లో చేర్చాలి.