20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్‌ SI

20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్‌ SI

నిర్మల్: నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేసింది. మామడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. గురువారం జరిగిన ఈ ఆపరేషన్‌లో.. ఎస్సై అశోక్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ రియల్టర్‌కు సంబంధించిన వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేసేందుకు ఎస్సై అశోక్ ₹40 వేలు లంచం డిమాండ్ చేశాడు. అనంతరం బేరసారాల తర్వాత ఫైనల్గా ₹20 వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని ఎస్సై తేల్చి చెప్పాడు. 

దీంతో విసిగిపోయిన బాధితుడు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పక్కాగా ప్లాన్ చేసి ఎస్సై లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనతో మామడ పోలీస్ స్టేషన్‌పై ప్రజల్లో తీవ్ర చర్చ మొదలైంది. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.