ఆ గుడిలో నిజంగానే నిధులున్నాయా..పొలిమేర2 లో చూపించింది నిజమేనా?

ఆ గుడిలో నిజంగానే నిధులున్నాయా..పొలిమేర2 లో చూపించింది నిజమేనా?

సత్యం రాజేష్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల( Kamakshi Bhaskarla) జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మా ఊరి పొలిమేర 2 (Ma Oori Polimera 2). ఓటీటీలో రిలీజైన పార్ట్ 1 ‘మా ఊరి పొలిమేర’ లో చూపించిన చేతబడి కాన్సెప్ట్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులకైతే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. దీంతో కొనసాగింపుగా పొలిమేర-2 విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

పార్ట్ 2 మూవీకి వచ్చేసరికి..పార్ట్‌-1లో మర్డర్‌ మిస్టరీకి.. చేతబడి అంశాన్ని జత చేసి చూపించగా..వాటి వెనుక దాగున్న అంశాలను ఒక్కోటి రివీల్ చేస్తూ డైరెక్టర్ తెరకెక్కించాడు. కొమిరి చేసే క్షుద్ర పూజలకు..జాస్తిపల్లి లోని గుడికి మధ్య ఉన్న లింక్ ను చెప్పడానికి డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశాడు. ఎందుకంటే, ఎక్కడో ఉన్న జాస్తిపల్లి ఏకపాదమూర్తి గుడికి..కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి లింక్ పెట్టి..మధ్యలో క్షుద్ర పూజలతో కొమిరిని చూపించారు. 

also read :- మీరు ఎప్పటికీ నా సూపర్ స్టార్ నాన్న: మహేష్ ఎమోషనల్ ట్వీట్
 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే..సినిమాలో భాగంగా ఆ గుడి జాస్తిపల్లిలో ఉందని డైరెక్టర్ అనిల్ చూపించారు. కానీ వాస్తవానికి గుడి ఉండేది..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లా,జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున గల గండికోట గ్రామంలో ఉంది. 

ఆ గుడిలో నిజంగానే నిధులున్నాయా: 

ఎంతో పేరు గాంచిన ఈ గుడిలో.. ప్రస్తుతం దేవుడి విగ్రహం కూడా లేదు. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ గుడి..దాదాపు ఐదు దశాబ్దాలపాటు నాలుగు సామ్రాజ్యాలకు వెన్నుదన్నుగా నిలిచింది. మహ్మదీయుల దాడుల వల్ల ఈ గుడి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో గుడిలో ఉన్న విగ్రహాన్ని భద్రపరుచుట కొరకు..అక్కడి నుంచి కడప జిల్లాలోని మైదుకూరుకు తరలించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ గుడి ఊరికి దూరంగా ఉండటం వల్ల.. అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని..కనుకే టూరిస్ట్లు లేని టైంలో గుడిని లాక్‌ చేసి ఉంచుతారని సమాచారం. 

అక్కడ ఉన్న స్థానికులు చెబుతున్న ప్రకారం..ఆ గుడిలో ఎలాంటి నిధులు లేవని..మహ్మదీయుల దాడుల సమయంలోనే పూర్తిగా వాటిని దోచుకున్నారని..కానీ గుడి గోడలపై మాత్రం చాలా ప్రత్యేకమైన చిహ్నాలు ఉన్నట్లు చెబుతున్నారు. పొలిమేర 2 లో కూడా గుడి గోడలపై ఉన్న శిల్పాలను చూపిస్తారు. 

ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోను..దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడ పైభాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉందని అక్కడి చరిత్ర చెబుతుంది. అలాగే కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారని చరిత్రకారుల నానుడి. 

భారత ప్రభుత్వం ఈ గుడిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది. ఈ గుడిలో ప్రభాస్ రాధేశ్యామ్‌, చిరు సైరా నరసింహారెడ్డి, ఇండియన్‌-2,మర్యాద రామన్న వంటి చిత్రాలు ఇక్కడ షూటింగ్‌ జరుపుకున్నాయి.