మీరు ఎప్పటికీ నా సూపర్ స్టార్ నాన్న: మహేష్ ఎమోషనల్ ట్వీట్

 మీరు ఎప్పటికీ నా సూపర్ స్టార్ నాన్న: మహేష్ ఎమోషనల్ ట్వీట్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కృష్ణ ఒక ట్రెండ్‌‌ సెట్టర్‌‌‌‌గా చెప్పొచ్చు. నటుడిగా కెరీర్‌‌‌‌ ప్రారంభించి, నిర్మాతగా, దర్శకుడిగా  ఎన్నో సినిమాలు తీశారు. స్టూడియో అధినేతగానూ మెప్పించారు. ఇవాళ (నవంబర్ 15న) కృష్ణ వర్ధంతి సందర్బంగా..మహేష్ బాబు తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. మీరు ఎప్పటికీ నా సూపర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కృష్ణ సంస్కరణ కార్యక్రమానికి భార్య నమ్రతతో పాటు..ఘట్టమనేని కుటుంబసభ్యులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈక్రమంలోనే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యి నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

టాలీవుడ్ సినిమాకి కొత్త విషయాలను, టెక్నాలజీని పరిచయం చేసిన క్రెడిట్ కృష్ణకే దక్కుతుంది. ఆయన నటించిన తొలి చిత్రం ‘తేనెమనసులు’ ఫస్ట్‌‌ ఈస్ట్‌‌మన్‌‌ కలర్‌‌ సోషల్‌‌ మూవీ. తెలుగులో ఫస్ట్ జేమ్స్ బాండ్‌‌ మూవీ ‘గూఢచారి 116’, తొలి ప్యూజీ రంగుల చిత్రం ‘భలే దొంగలు’, తొలి సినిమా స్కోప్‌‌ టెక్నో విజన్‌‌ చిత్రం ‘దొంగల దోపిడి’, మొదటి కౌబాయ్ మూవీ ‘మోసగాళ్లకు మోసగాడు’, తొలి ఫుల్ స్కోప్ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70ఎంఎం సినిమా ‘సింహాసనం’, తొలి డీటీయస్ సినిమా ‘తెలుగు వీర లేవరా’ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు.