Health Alert : మీ పిల్లలకు బయట బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారా.. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త

Health Alert : మీ పిల్లలకు బయట బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారా.. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త

పెద్దలే కాదు పిల్లలు కూడా ఉదయం పూట కాస్త గట్టిగానే తినాలి. లేదంటే మానసిక సమస్యలు తప్పవు అంటోంది జర్నల్ ఫ్రోటియర్స్ ఇన్ న్యూట్రిషియన్ స్టడీ. ఈ స్టడీ ప్రకారం టైంకి బ్రేక్ ఫాస్ట్ తినని పిల్లల్లో యాంగ్జెటీ, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. టైంకి బ్రేక్ ఫాస్ట్ తినకపోయినా, బ్రేక్ ఫాస్ట్ లో  సరిపడా పోషకాలు అందకపోయినా.. పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయంపై ఈ స్టడీ చేశారు. 

ఈ రీసెర్చ్ లో పాల్గొన్న లోపేజ్ గిల్.. 2017 లో స్పానిష్ నేషనల్ హెల్త్ సర్వేని ఆధారంగా చేసుకోని ఈ స్టడీ చేశారు. నాలుగు నుంచి పద్నాలుగేండ్ల మధ్య వయసున్న పిల్లలపై జరిగిన ఈ స్టడీలో బ్రేక్ ఫాస్ట్  సరిగా తినని పిల్లల్లో మూడ్ స్వింగ్స్, యాంగ్జెటీ సమస్యలు ఉన్నట్లు తేలింది. బయట బ్రేక్ ఫాస్ట్ తినే పిల్లలో ఈ సమస్య ఇంకాస్త ఎక్కువే ఉన్నట్టు చెప్తున్నారు రీసెర్చర్లు. 

Also Read :- Health Alert : చెప్పా పెట్టకుండా వస్తున్న గుండెపోట్లు.. చిన్న వయసులో సంకేతాలు ఇవే

దానికి కారణం బయటి ఫుడ్ లో  సరిపడా పోషకాలు లేకపోవడమే. అలాగే బ్రేక్ ఫాస్ట్ లో  కాఫీ, టీ, పాలు, చాక్లెట్, కోకోవా, పెరుగు, బ్రెడ్, టోస్ట్, సిరియల్స్ .. పేస్ట్రీస్ తిన్న పిల్లలో ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయని చెప్తోంది ఈ రీసెర్చ్.