
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. బీసీలకు శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పించారని కోర్టుకు చెప్పారు. సర్వేలో 57.6 శాతం బీసీలు ఉన్నారని తేలిందన్నారు. కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు ఫిక్స్ చేశారని కోర్టుకు తెలిపారు అడ్వొకేట్ జనరల్. బీసీ బిల్లు గవర్నర్ కు పంపి ఆరు నెలలు దాటింది కాబట్టి.. తమిళనాడు కేసులో సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే భావిస్తున్నామన్నారు. దీనిపై ప్రత్యేక నోటిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి.
ప్రభుత్వ తరపున వాదనలు
- తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసింది...
- డోర్ టూ డోర్ క్యాంపెన్ చేసి ప్రభుత్వం నివేదిక తీసుకుంది..
- డెడ్ కేషన్ కమిషన్ సమగ్ర విచారణ జరిపింది..
- అన్ని వివరాలను ప్రభుత్వం సేకరించింది.
- శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే డేటా ఆధారంగానే ఈ రిజర్వేషన్స్ ఫిక్స్ చేశారు.
- సర్వే డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఫిక్స్ చేశారు
- బీసీల జనాభా ప్రాతిపదికన బీసీలకు 42 శాతం ప్రభుత్వం కేటాయించింది..
- బీసీలకు 42 శాతం రీజర్వేషన్ కల్పిస్తూ ఉభయ సభల్లో చట్ట సవరణ చేసింది..
- బిల్లు నెంబర్ 4 కాపీని కోర్టుకు సమర్పించిన అడ్వొకేట్ జనరల్
- ఏక గ్రీవంగా సభలు ఆమోదం తెలిపింది..
- మార్చి నుండి గవర్నర్ వద్ద బిల్ పెండింగ్ లో ఉంది
- గవర్నర్ /ప్రెసిడెంట్ అనుమతి ఇస్తేనే గెజిట్ వస్తుంది
- తమిళ నాడు కేస్ లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 6 నెలలకు పైబడి పెండింగ్లో ఉంది కాబట్టి గవర్నర్ అనుమతి పొందినట్టే భావిస్తున్నాం.
- బిల్ పై గవర్నర్ అనుమతి వచ్చినట్టే భావిస్తున్నాం కాబట్టి, యాక్ట్ అమలులో ఉన్నట్టే.
- దీని పై ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదు