షర్మిల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్లులో వాదనలు

షర్మిల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్లులో వాదనలు

షర్మిల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్లులో వాదనలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన తీర్పును కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఆరు నెలలు, మూడు సంవత్సరాల లోపు జైలు శిక్షపడేవేనని తెలిపారు. షర్మిల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. హైకోర్టు నిబంధనలను సైతం పోలీసులు పాటించడం లేదన్నారు. షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న ఒక్క వీడియో మాత్రమే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు.. కానీ అంతకంటే ముందు జరిగిన వీడియో గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని కోర్టుకు వివరించారు.

షర్మిల పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని పోలీస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. షర్మిలపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని.. షర్మిలకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ కేసులో ఇంకా కొంతమంది సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలను విన్న నాంపల్లి కోర్టు..తీర్పును కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.