
కరీంనగర్: ఆటోలో ఏడుగురికి మించకుండా ఎక్కించుకోవాల్సిన డ్రైవర్ 24 మందిని ఎక్కాంచాడు. ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఆటోను గమనించిన పోలీసులు తనిఖీ చేయగా..పిల్లలతో కలిసి 24 మంది ఉన్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
తిమ్మాపూర్ దగ్గర పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆటోలో ఉన్న ప్రయాణికుల సంఖ్యను చూసి పోలీసులు షాకయ్యారు. మహిళలు, పిల్లలు కలిపి మొత్తం 24 మంది ఆ ఆటోలో ప్రయాణిస్తున్నారు. లెక్కకు మించి అంతమందిని ఆటోలో ఎందుకు ఎక్కించుకున్నావని పోలీసులు అబ్దుల్ కు క్లాస్ పీకారు. ఘటనను వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. లిమిట్ ను ఎవ్వరూ క్రాస్ చేయకూడదని..ప్రమాదాలను కోరి తెచ్చుకోవద్దని ట్వీట్ చేశారు పోలీసులు. డ్రవర్ పై కేసు నమోదు చేసి ఆటోను రవాణా శాఖ అధికారులకు అప్పగించారు.
People should take care of their own safety. They shouldn't board in overcrowded passenger autos unmindful of their safety pic.twitter.com/Aul2l2LM7C
— CP KARIMNAGAR (@cpkarimnagar) August 11, 2019