జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్ ముగియటంతో గేట్లు మూసివేశారు. అప్పటి వరకు లైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు స్లోగా సాగిన పోలింగ్.. సాయంత్రం వరకు కాస్త పెరిగింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా 2025 నవంబర్ 11న ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం స్లోగా ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పెరిగింది. ఆ తర్వాత ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యా్హ్నం 3 గంటలకు 40.2 శాతం ఉన్న పోలింగ్.. సాయంత్రానికి 47.16 శాతానికి చేరుకుంది.
జూబ్లీహిల్స్ లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగింది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుంది.
