IPL 2026: జడేజాను రిటైన్ చేసుకోవాలి.. CSK కోసం చేసిన పోరాటం మర్చిపోకూడదు: రైనా

IPL 2026: జడేజాను రిటైన్ చేసుకోవాలి.. CSK కోసం చేసిన పోరాటం మర్చిపోకూడదు: రైనా

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ట్రేడింగ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెళ్తున్నాడనే వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 12 సీజన్ ల పాటు చెన్నై జట్టులో కొనసాగిన ఈ స్టార్ ఆల్ రౌండర్ ను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకోవడానికి సిద్ధమైంది. సూపర్ కింగ్స్ తమ జట్టులోకి  రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను ట్రేడింగ్ ద్వారా తీసుకోనుంది. శాంసన్ చెన్నై జట్టులోకి వస్తే ట్రేడింగ్ ద్వారా వారు జడేజాతో పాటు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ను రాజస్థాన్ కు ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది.  

అధికారిక ప్రకటన రాకపోయినా ఈ ట్రేడింగ్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టు గట్టిగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ లెజెండరీ ఆటగాడు సురేష్ రైనా ఆల్ రౌండర్ జడేజాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రైనా మాట్లాడుతూ ఇలా అన్నాడు. "జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. అతను CSKకు గన్ ప్లేయర్. చెన్నై జట్టు కోసం ఎన్నో సంవత్సరాలు అతను చేసిన కృషి మరువలేనిది. కాబట్టి సర్ జడేజా చెన్నై జట్టుతోనే ఉండాలి". అని రైనా చెప్పుకొచ్చాడు. పెద్ద పెద్ద స్పోర్ట్స్ నివేదికలు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో ఈ ట్రేడింగ్ దాదాపు సెట్ అయినట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

జడేజా ఇప్పటివరకు 254 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ తర్వాత అత్యధిక మ్యాచ్ లాడిన ఐదో ప్లేయర్ గా నిలిచాడు. 143 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా జడేజాని కావడం విశేషం. 16 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను సాధించాడు. ధోనీతో పాటు అత్యధిక ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్ అవార్డులు (16) కూడా జడేజా సొంతం. 2022లో జడేజాను చెన్నై కెప్టెన్ గా నియమించిన జట్టు ఘోరంగా ఆడడంతో మళ్ళీ ధోనీనే సారధిగా నియమించింది. 

►ALSO READ | Naseem Shah: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ ఇంటిపై బుల్లెట్లతో దాడి.. 5 గురు అనుమానితులు అరెస్టు

19 ఏళ్ల వయసులో జడేజా ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి జట్టు ఆర్ఆర్.  2008లో అతను టైటిల్ గెలుచుకున్న తొలి జట్టు కూడా అదే. జడేజా మొదటి రెండు సీజన్లలో ఆర్ఆర్ తరఫున ఆడాడు. 2010లో ముంబై ఇండియన్స్‌తో నేరుగా ఒప్పందంపై చర్చలు జరపడానికి ప్రయత్నించినందుకు ఐపీఎల్ అతనిని సస్పెండ్ చేసింది. నిషేధం తర్వాత జడేజా 2011లో కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. 2012లో CSK 2 మిలియన్లకు కొనుగోలు చేసింది.