మహేష్-రాజమౌళి SSMB 29 అప్డేట్స్.. పృథ్వీరాజ్‌ లుక్‌, సంచారి సాంగ్ ఏం చెబుతున్నాయి?

మహేష్-రాజమౌళి SSMB 29 అప్డేట్స్.. పృథ్వీరాజ్‌ లుక్‌, సంచారి సాంగ్ ఏం చెబుతున్నాయి?

వరల్డ్ ఆడియన్స్.. మోస్ట్ ఎవైటెడ్ మూవీ (SSMB 29). మహేష్ బాబు-రాజమౌళి కాంబోపై వరుస అప్డేట్స్ వస్తున్నాయ్. ఇటీవలే SSMB 29 విలన్.. పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' ఫస్ట్ లుక్‌‌‌‌ రిలీజ్ చేశారు జక్కన్న. ఈ పోస్టర్ వెనుక చాలా పోలికలు వినిపించినప్పటికీ.. ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యాలు కూడా దాచిపెట్టాడు జక్కన్న. ఇతిహాసగాథ రామాయణంలో కుంభకర్ణుడి కుమారులను ‘కుంభుడు’, ‘నికుంభుడు’గా పిలుస్తారు.

ఇందులో ‘కుంభుడు’ భయమెరగని పరాక్రమవంతుడు. అలాంటి కుంభుడు.. హనుమంతుడి పాత్రతో కూడిన మహేష్ బాబుకి పెట్టె షరతులతో కథ ఉంటుందని టాక్ నడుస్తోంది. కుంభ షరతు మేరకు సంజీవనిలాంటి రక్షణ కోసం మహేష్ ఎలాంటి సాహసం చేశాడు. ఎలా సంచారిగా మారాడు అనేది SSMB కథగా ఉంటుందని ప్రచారమైతే ఉంది. ఇపుడు ఈ సమాచారం అంతా.. కుంభ పోస్టర్ ద్వారా రివీల్ అయితే.. లేటెస్ట్గా రిలీజ్ చేసిన సంచారి సాంగ్ ద్వారా మరింత క్లారిటీ వచ్చేసింది.

‘గ్లోబ్‌‌‌‌ట్రాటర్’ పేరుతో వచ్చిన ఈ సాంగ్ యూట్యూబ్లో, వరల్డ్ మ్యూజిక్ చార్ట్లో సూపర్ ట్రెండింగ్గా దూసుకెళ్తోంది. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటను MM కీరవాణి కంపోజ్ చేయగా.. హీరోయిన్ శృతి హాసన్ పాడింది. ఈ పాటలో ప్రతి పదం శివతత్వాన్ని సూచిస్తోంది. కాలాన్ని శాసించేవాడు, సంచారి సహా ప్రతి పదం రుద్రత్వం చుట్టూ తిరుగుతోంది.

కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజూ పరుగేలే.. వేగాన్ని శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేను.. ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే .. రారా రారా ధీరా ధ్రువతార అంటూ సాగే ఈ పాటకు శ్రుతిహాసన్ తన వాయిస్తో ప్రాణం పోసింది. ప్రతిపదాన్ని అర్థవంతంగా, గంభీరంగా పలికింది. ఓ సారి సంచారి లిరిక్స్ వైపు ఓ లుక్కేయండి. 

సంచారి సాంగ్ లిరిక్స్:

కాలాన్నే శాసిస్తూ.. ప్రతి రోజూ పరుగే లే..

వేగాన్నే శ్వాసిస్తూ.. పెనుగాలై తిరిగేలే..

ఖండాలే దాటేస్తూ.. ఖగరాజై వాలే..

రారా.. రారా.. ధీరా.. ధృవతారా..

రారా.. స్వైరా.. సంచారా..

సంచారి.. సంచారి..

నినదించే రణభేరి..

సంహారి.. సంహారి..

మృత్యువుపై తన స్వారీ..

సంచారి.. సంచారి..

సాహసమే తన దారి..

సంహారి.. సంహారి..

అసురులపై అసిధారి..

కాలాన్నే శాసిస్తూ..

జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్.. జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్..

జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్.. జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్..

ట్రాటర్..

జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్.. జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్..

జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్.. జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్..

సంచారి.. సంచారి..

నినదించే రణభేరి..

సంహారి.. సంహారి..

మృత్యువుపై తన స్వారీ..

సంచారి.. సంచారి..

సాహసమే తన దారి..

సంహారి.. సంహారి..

అసురులపై.. 

దర్శక ధీరుడు రాజమౌళి మేకింగ్ థాట్ వేరే. ఎవ్వరికీ అంత త్వరగా అంతు చిక్కదు. లైఫ్‌స్టైల్ అడ్వెంచర్, ఇతిహాస కథనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దానికి తోడు హ్యూమన్ ఎమోషన్స్ను కళ్ళకు కట్టినట్లుగా చూపించి వరుస విజయాలు అందుకుంటున్నాడు. ఇపుడు  SSMB 29 సినిమా చరిత్ర, పురాణాల మిశ్రమంగా ఉండబోతోందని క్లారిటీ వచ్చింది. అడ్వెంచర్ మాత్రమే కాకుండా, టెక్నాలజీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, మైథలాజి అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మారే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

►ALSO READ | ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ కేసులో విజయ్ దేవరకొండ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన CID

ఇకపోతే, ఈనెల 15న శనివారం హైదరాబాద్‌‌‌‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్‌‌‌‌ట్రాటర్’ పేరుతో గ్రాండ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించబోతున్నారు. ఇందులో ఫస్ట్ లుక్‌‌‌‌తోపాటు టైటిల్ గ్లింప్స్‌‌‌‌ కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు వస్తారని అంచనా ఉంది. హీరోయిన్ ప్రియాంక చోప్రాతో టీమ్ అంతా పాల్గొననున్న ఈ ఈవెంట్‌‌‌‌ను హాలీవుడ్ స్థాయిలో గ్రాండ్‌‌‌‌గా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జియో హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్ స్ట్రీమింగ్‌‌‌‌ అవ్వనుంది.