ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ కేసులో విజయ్ దేవరకొండ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన CID

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ కేసులో విజయ్ దేవరకొండ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన CID

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో సీఐడీ ఆఫీసులో హీరో విజయ్ దేవరకొండ విచారణ ముగిసింది. 2025 నవంబర్ 11 వ తేదీన విచారణకు హాజరైన విజయ్ నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు సీఐడీ అధికారులు. దాదాపు గంటన్నరకు పైగా విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు.

తాను లీగల్ గానే గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశానని ఈ సందర్భంగా స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్. తాను ప్రమోట్ చేసిన A23 గేమింగ్ యాప్ తెలంగాణా లో ఓపెన్ అవ్వదని CID కి తెలిపారు. భవిష్యతులో గేమింగ్ కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోట్ చేయనని CID అధికారుల ముందు చెప్పారు.

►ALSO READ | 12ARailwayColony: ఉత్కంఠగా అల్లరి నరేష్ హర్రర్ మూవీ ట్రైలర్..

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లకు తెలంగాణ CID అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో విజయ్ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సీఐడీ ఎదుట హాజరు అవ్వగా..  దాదాపు గంటన్నరపాటు విచారించి స్టేట్ మెంట్ తీసుకున్నారు అధికారులు.